Dog Attack | ఇద్దరికి గాయాలు

Dog Attack | ఇద్దరికి గాయాలు

పెరుగుతున్న కుక్క కాటు బాధితులు… పట్టించుకోని అధికారులు


ఊట్కూర్, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా (Narayanpet district) ఊట్కూర్ మండల కేంద్రంలో కుక్కకాటు బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. గురువారం ఊట్కూర్ మండల కేంద్రంలోని భరత్ నగర్ వీధికి చెందిన మమ్మద్ హర్షాన్ అనే బాలుడు ఇంటి ముందు ఆడుకుంటుండగా కుక్కకాటు వేసింది. అలాగే పాతపేట వీధికి చెందిన స్వాతి ఇంటి ముందు ఉండగా కుక్క దాడి (Dog Attack) చేసి కరిచింది.

దీంతో బాధితులు ఊట్కూర్ (Utkoor) ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్సలు చేసుకున్నారు. కుక్కలు స్వైర విహారం చేస్తూ ప్రజలపై దాడి చేస్తుండడంతో ప్రజలు ఇంట్లో నుంచి బయటికి వచ్చేందుకు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి కుక్కలను తరలించాలని ప్రజలు కోరుతున్నారు.

Leave a Reply