HYD | పడిపూజలో కార్పొరేటర్ ముద్దం ప్రత్యేక పూజలు…

HYD | పడిపూజలో కార్పొరేటర్ ముద్దం ప్రత్యేక పూజలు…
ఓల్డ్ బోయిన్పల్లి ,ఆంధ్రప్రభ : అంజయ్య నగర్ బోయిన్ చెరువు వద్ద ఉన్న కట్ట మైసమ్మ దేవాలయంలో అయ్యప్ప స్వామి 18వ మహా పడిపూజ వైభవంగా జరిగింది.
సుధాకర్ గురుస్వామి మిత్రబృందం ఆధ్వర్యంలో.. సోమవారం జరిగిన ఈ ఆధ్యాత్మిక సేవలో స్థానిక కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ పాల్గొన్నారు.
డివిజన్ సీనియర్ నాయకులు కర్రె జంగయ్య, మల్లేష్ యాదవ్‌లతో కలిసి కార్పొరేటర్ ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా కార్పొరేటర్ నరసింహ యాదవ్ మాట్లాడుతూ… ప్రతి ఏడాది కార్తీకమాసంలో కఠిన దీక్షతో అయ్యప్ప పూజలు నిర్వహించడం అభినందనీయం అని అన్నారు.
ఆధునిక జీవితంలో ఆధ్యాత్మికత ప్రతి వ్యక్తికి శాంతిని, శక్తిని అందిస్తుందని… అయ్యప్ప మాల ధరించడం వంటి ఆచారాలు మంచి మార్గం అని పేర్కొన్నారు.
