మహమ్మది కుంటలో పడి వ్యక్తి మృతి
ముధోల్, ఆంధ్రప్రభ : ముధోల్ మండల కేంద్రంలోని నయాబాది(Nayabadi)లో నివాసం ఉంటున్నసయ్యద్ ఖాసీం అలీ (54) స్నానం చేయడానికి వెళ్లి మృత్యువాత పడ్డాడు. చెరువులో అలీ ప్రమాదవశాత్తు మునిగి ప్రాణాలు కోల్పోయాడని ఎస్ఐ బిట్ల పెర్సిస్(SI Bitla Persis) తెలిపారు.
సయ్యద్ ఖాసీం అలీ తండ్రి సయ్యద్ ఇనాయత్ అలీ(Syed Inayat Ali) ఈ రోజు ఉదయం మహమ్మది కుంట చెరువులో స్నానం చేయడానికి వెళ్లాడు. మద్యం మత్తులో చెరువులో దిగడం వల్ల ప్రమాదవశాత్తు మునిగి చనిపోయినట్లు ఎస్ఐ తెలిపారు. మృతుడు కొడుకు సయ్యద్ అహ్మద్ అలీ(Syed Ahmed Ali) ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు చెప్పారు.


