కనీస ధర కోసం కదం తొక్కిన రైతులు

కనీస ధర కోసం కదం తొక్కిన రైతులు

చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : తమకు గుజ్జు పరిశ్రమలు 8 రూపాయలు ఇవ్వాల్సిందే అంటూ మామిడిరైతుల(Mango Farmers) నినాదాలతో చిత్తూరు వీధులు మార్మోగాయి. చిత్తూరు మాంగో మార్కెట్ యార్డు నుంచి వాహన భారీ ర్యాలీ కలెక్టరేట్ లోని ప్రజా సమస్యల పరిష్కార వేదిక వరకు సాగింది. చిత్తూరు(Chittoor), తిరుపతి(Tirupati), అన్నమయ్య(Annamaiah) మూడు జిల్లాల నుండి వచ్చిన రైతుల ఏకైక నినాదం ప్రభుత్వం ప్రకటించిన 8+4= 12 రూపాయలు రైతుల అకౌంట్లకు చెల్లించాలని.

గుజ్జు పరిశ్రమలు రైతులకు 4 ,5 రూపాయలు మాత్రమే చెల్లిస్తూ అన్యాయం చేస్తున్నాయని పలువురు రైతులు వాపోయారు. మామిడి రైతుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ వాహన ర్యాలీ గాంధీ విగ్రహాన్నిపూలమాలతో సత్కరించింది. హైరోడ్డు, గిరింపేట మీదుగా సాగిన వాహన ర్యాలీలో నినాదాలు చేస్తూ రైతులు(Agriculture) ఉద్వేగంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం ప్రతినిధి వర్గం జాయింట్ కలెక్టరుకు వినతిపత్రం సమర్పించారు.


సుమారు 15 వేల మంది రైతులు(Agriculture) సంతకాలు చేసి ముఖ్య మంత్రికి వినతిపత్రం సమర్పించారు. సంక్షేమ సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్సులు ప్రసంగిస్తూ ఈ శాసనసభ సమావేశాలు జరిగే రోజుల్లో ముఖ్యమంత్రిని కలిసి 70 వేల మంది మామిడి రైతులకు రూ.8 లు పరిశ్రమల నుండి చెల్లించడానికి చర్యలు తీసికొమ్మని విజ్ఞప్తి చేస్తామన్నారు.
ఈ కార్యక్రమం సంక్షేమ సంఘం కమిటీ నుండి ఆనంద నాయుడు, హరిబాబు చౌదరి, జనార్దన్, లవకుమార్ రెడ్డి, చంద్ర మౌళి, సుకుమార్ నాయుడు, కుమారి భారతి ముందుండి నడిపించారు.

తమకు గుజ్జు పరిశ్రమలు 8 రూపాయలు(Mango Farmers) ఇవ్వాల్సిందే అంటూ మామిడిరైతుల నినాదాలతో చిత్తూరు వీధులు మార్మోగాయి. చిత్తూరు మాంగో మార్కెట్ యార్డు నుంచి వాహన భారీ ర్యాలీ కలెక్టరేట్ లోని ప్రజా సమస్యల పరిష్కార వేదిక వరకు సాగింది. చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య మూడు జిల్లాల నుండి వచ్చిన రైతుల ఏకైక నినాదం(Farmers Rights) ప్రభుత్వం ప్రకటించిన 8+4= 12 రూపాయలు రైతుల అకౌంట్లకు చెల్లించాలని.

గుజ్జు పరిశ్రమలు రైతులకు 4 ,5 రూపాయలు మాత్రమే చెల్లిస్తూ అన్యాయం చేస్తున్నాయని పలువురు రైతులు వాపోయారు. మామిడి రైతుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ వాహన ర్యాలీ గాంధీ విగ్రహాన్నిపూలమాలతో సత్కరించింది. హైరోడ్డు, గిరింపేట మీదుగా సాగిన వాహన ర్యాలీలో నినాదాలు చేస్తూ రైతులు ఉద్వేగంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం ప్రతినిధి వర్గం జాయింట్ కలెక్టరుకు వినతిపత్రం సమర్పించారు.


సుమారు 15 వేల మంది రైతులు సంతకాలు చేసి ముఖ్య మంత్రికి వినతిపత్రం సమర్పించారు. సంక్షేమ సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్సులు ప్రసంగిస్తూ ఈ శాసనసభ సమావేశాలు జరిగే రోజుల్లో ముఖ్యమంత్రిని కలిసి 70 వేల మంది మామిడి రైతులకు రూ.8 లు పరిశ్రమల నుండి చెల్లించడానికి చర్యలు తీసికొమ్మని విజ్ఞప్తి చేస్తామన్నారు.
ఈ కార్యక్రమం సంక్షేమ సంఘం కమిటీ నుండి ఆనంద నాయుడు, హరిబాబు చౌదరి, జనార్దన్, లవకుమార్ రెడ్డి, చంద్ర మౌళి, సుకుమార్ నాయుడు, కుమారి భారతి ముందుండి నడిపించారు.

Leave a Reply