10 గేట్లు ఎత్తి.. 8300 క్యూసెక్కులు విడుదల

ఆంధ్రప్రభ, హైదరాబాద్: తెలంగాణ హైదరాబాద్‌(Hyderabad)లో భారీ వర్షాలతో ఉస్మాన్ సాగర్(Usman Sagar), హిమాయత్ సాగర్(Himayat Sagar) జలాశయాలలో నిండుకుండల్లా మారిపోయాయి. మూసీ నది తీవ్ర స్థాయికి చేరుకుంది. జంట జలాశయాల గేట్లను ఎత్తివేయాలని అధికారులు ఆదేశించారు. ప్రస్తుతం, 10 గేట్లు తెరిచి, 8,300 క్యూసెక్కుల(8,300 cusecs) నీటిని మూసీలోకి విడుదల చేశారు, ఇది ఇప్పుడు మూసీ నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. వరదల కారణంగా నర్సింగ్ ఓ ఆర్ ఆర్ (ORR) సర్వీస్ రోడ్డు , ఔటర్ రింగ్ రోడ్ (ORR)కి ఇన్ పుట్, ఔట్ పాయింట్లు మూసివేశారు. ప్రత్యామ్నాయ మార్గాలలో ప్రయాణించాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు.

మంచిరేవు నర్సింగ్ మధ్య మార్గంలో ట్రాఫిక్ ను నిలిపివేశారు . అదనంగా, మంచిరేవుల వంతెన చుట్టూ ఉన్న ప్రాంతాల్లో వరద పరవళ్లు తొక్కుతోంది. జియాగూడ రహదారి కంటే 100 అడుగుల ఎత్తుకు నీటి మట్టాలు పెరిగాయి. జియాగూడ పురానాపులే మధ్య మార్గం మూసివేశారు. పురానాపులే నుంచి హైకోర్టు వైపు వెళ్లే వాహనాలను కారవాన్ మార్గంలో మళ్లించారు.

Leave a Reply