చింతూరు, ఆంధ్రప్రభ : ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా ఎస్పీ కిరణ్ చవాన్(Kiran Chavan) ఎదుట 20 మంది మావోయిస్టులు బుధవారం లొంగిపోయారు. పోలీసుల ఎదుట లొంగిపోయిన 20 మందిలో 11 మంది మావోయిస్టులపై రూ. 33 లక్షల రివార్డు ఉంది. లొంగిపోయినవారిలో 11 మంది మహిళలు ఉన్నారు.
ఆ రాష్ట్రంలో నియాద్ నెల్నార్ పథకం ద్వారా మావోయిస్టులు(Maoists) ప్రభావితులై సుక్మాలో మావోయిస్టులు లొంగిపోయారని పోలీసులు(Police) తెలిపారు. లొంగిపోయిన వారిలో ఇద్దరిపై రూ. 8 లక్షలు చొప్పున, ఒక మావోయిస్టుపై రూ 5 లక్షలు, మరో నలుగురు మావోయిస్టులపై రూ. 2 లక్షలు చొప్పున, మరో నలుగురు మావోయిస్టులపై లక్ష రూపాయల చొప్పున రివార్డు ఉన్నట్లు ఎస్పీ వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు రాజేష్ కుమార్ పాండే, దీపక్ కుమార్ శ్రీవాస్తవ, విజయ శంకర్, సురేష్ సింగ్, బీరేంద్ర కుమార్, గంగ్వానే కైలాష్ సంభాజీ, అభిషేక్ వర్మ, పరమేశ్వర్ తిలక్వర్, ఆశిష్ సింగ్‌లు ఉన్నారు.

