తెల్లాపూర్‌లోని ISKCON CDEC ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి మహోత్సవాలు ఈ నెల ఆగస్టు 16న వైభవంగా జరగనున్నాయి. విస్తారమైన PMG ఫార్మ్‌హౌస్ వేదికగా ఉండగా, అక్కడి పరిసరాలను వృందావన వాతావరణం తలపించేలా ప్రత్యేక అలంకరణలు, శ్రీకృష్ణ లీలలకు సంబంధించిన లీలా స్థలాలు సజీవంగా అమర్చబడతాయి.
ఈ ఏడాది శ్రీకృష్ణుడి 5252వ అవతార దినోత్సవం సందర్భంగా భక్తి భావంతో 5252 నైవేద్యాలు సమర్పించనున్నారు. భక్తులు స్వయంగా సాత్విక నైవేద్యాలు తయారు చేసి సమర్పించవచ్చు. ప్రతిగా అందరికీ మహా ప్రసాదం అందజేయబడుతుంది.
మధ్యాహ్నం 2 గంటలకు పిల్లల కోసం పాట, నృత్యం, కలరింగ్, ఫ్యాన్సీ డ్రెస్, శ్లోక పఠనం వంటి పోటీలు ప్రారంభం అవుతాయి. సాయంత్రం 5:30కు సాంస్కృతిక కార్యక్రమాలు, రాత్రి 8 గంటలకు కథా-కీర్తన,9 గంటలకు మహాభిషేకం నిర్వహించబడుతుంది. అనంతరం 10 గంటలకు ప్రత్యేక దర్శనం, రాత్రి 12 గంటలకు మహా ప్రసాదం పంపిణీ చేయబడుతుంది. ప్రవేశం ఉచితం. వర్షం కారణంగా అంతరాయం లేకుండా పలు టెంట్లు, వాలెట్ పార్కింగ్ సౌకర్యాలు కల్పించనున్నారు.

