Damodar Rajanarsimha | మంత్రి దామోదర్‌తో మయూరి సింగ్ భేటీ
Damodar Rajanarsimha | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహను ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఇన్‌చార్జి మయూరి సింగ్ హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం మహిళా సాధికారత, మహిళల సంక్షేమం, ఆరోగ్య పరిరక్షణ, అభివృద్ధి కోసం అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలపై ఇద్దరూ చర్చించారు. ప్రభుత్వం చేపడుతున్న మహిళా సంక్షేమ కార్యక్రమాలను మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లే అంశంపై కూడా సమావేశంలో చర్చించినట్లు తెలిపారు.
వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖల పరిధిలో మహిళా సాధికారత కోసం పలు కార్యక్రమాలు అమలు చేస్తున్నామని మంత్రి దామోదర్ రాజనర్సింహ పేర్కొన్నారు. నర్సింగ్ అధికారుల నియామకాలు, వైద్య విద్య విస్తరణ, మహిళల ఆరోగ్య పరిరక్షణ, స్వయం సహాయక సంఘాల బలోపేతం వంటి అంశాలకు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. తెలంగాణలో మహిళా కాంగ్రెస్‌ను మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నామని మయూరి సింగ్ ఈ సందర్భంగా మంత్రికి వివరించినట్లు సమాచారం.
