అధికారులపై సీపీఎం ఆగ్రహం..

కోర్టులో కొనసాగుతున్న భూములను రిజిస్ట్రేషన్ చేస్తున్న అధికారులు సిపిఎం ఆరోపణ

వికారాబాద్, ఆంధ్రప్రభ : వికారాబాద్ మండలం మదనపల్లి గ్రామంలో కోర్టులో కొనసాగుతున్న భూములను మండల రెవెన్యూ అధికారులు రిజిస్ట్రేషన్ చేస్తున్నారని ఆరోపిస్తూ వికారాబాద్ మండల సిపిఎం నాయకులు సోమవారం ధర్నా నిర్వహించారు. వికారాబాద్ జిల్లా సిపిఎం కార్యదర్శి మహిపాల్ నేస్తం లో సిపిఎం నాయకులు పెద్ద ఎత్తున పైసలు కాలనీ చేరుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిపాల్ మాట్లాడుతూ కొనసాగుతున్న వ్యవహారాన్ని పక్కనపెట్టి అధికారులు భూములను రిజిస్ట్రేషన్ చేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. ఈ విషయంలో జిల్లా కలెక్టర్ స్పందించి చట్ట విరుద్ధంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు