Telangana Temples | బాసరలో కళాపకర్షణ పూజలు

జ్ఞాన సరస్వతి ఆలయంలో ప్రత్యేక పూజలు

Telangana Temples | బాసర, ఆంధ్రప్రభ : సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవి అమ్మవారి ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా శనివారం శ్రీ శృంగేరి జగద్గురువుల ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పునర్నిర్మాణ పనుల ప్రారంభం నిమిత్తం అమ్మవార్లను బాలాలయంలో ప్రతిష్టాపన కై కళాపకర్షణ పూజలో భాగంగా గోపూజ, గణపతిపూజ, పుణ్యాహవాచనం, ఋత్విగ్వరణ నవగ్రహ బ్రహ్మ కలశ స్థాపన అగ్ని ప్రతిష్ఠ చేపట్టారు.

ఈ పూజ కార్యక్రమంలో ప్రధాన ఆలయ దాత సూరపనేని సునంద దంపతులు ఆలయ వ్యవస్థాపక వంశీయులు శరత్ పాఠక్,ఈవో అంజనీ దేవి, స్థానచార్యులు ప్రధానార్చకులు ప్రవీణ్ పాటక్,ప్రధాన అర్చకులు సంజీవ్ పూజారి వైదిక బృందం శృంగేరి పండితులు తదితరులు పాల్గొన్నారు.