Road Accident | ముగ్గురు దుర్మరణం
Road Accident | ముగ్గురు దుర్మరణం
Road Accident | ఆంధ్రప్రభ, వెబ్డెస్క్ : ఉత్తరప్రదేశ్లోని ఖుషీనగర్ జిల్లాలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదం ముగ్గురి ప్రాణాలను బలితీసుకుంది. వేగంగా దూసుకొచ్చిన ఎర్టిగా కారు బైక్ను బలంగా ఢీకొట్టింది.
ఢీకొట్టిన తీవ్రతకు బైక్పై ప్రయాణిస్తున్న ఇద్దరు మహిళలు, ఓ వ్యక్తి సుమారు 10 మీటర్ల దూరం గాల్లోకి ఎగిరి రోడ్డుపై పడిపోయారు. తీవ్ర గాయాల కారణంగా ముగ్గురూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
ప్రమాదం ధాటికి బైక్ పూర్తిగా ధ్వంసమై దాదాపు 20 మీటర్ల దూరంలో పడిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘోర ప్రమాదానికి సంబంధించిన భయానక దృశ్యాలు సమీపంలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
