fire accident | షార్ట్‌సర్క్యూట్‌తో మంటలు.. దట్టమైన పొగలు
fire accident | షార్ట్‌సర్క్యూట్‌తో మంటలు.. దట్టమైన పొగలు
fire accident | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : హైదరాబాద్ కూకట్‌పల్లి పరిధిలోని వడ్డేపల్లి ఎన్‌క్లేవ్ వద్ద శనివారం అగ్నిప్రమాదం జరిగింది. స్థానికంగా ఉన్న డీబీఎస్ (DBS) ఏటీఎం కేంద్రంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి దట్టమైన పొగలు వ్యాపించాయి.
ఏటీఎం కేంద్రం నుంచి పొగలు వస్తుండటాన్ని గమనించిన స్థానికులు వెంటనే అప్రమత్తమై మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. అనంతరం అగ్నిమాపక శాఖకు సమాచారం అందించగా, సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం షార్ట్‌సర్క్యూట్ కారణంగానే ఈ అగ్నిప్రమాదం సంభవించి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అగ్నిప్రమాదంతో ఏటీఎం కేంద్రంలో జరిగిన నష్టంపై అధికారులు అంచనా వేస్తున్నారు.
