టేకుమట్లలో గుడుంబా స్వాధీనం..
- వ్యక్తిపై కేసు నమోదు
టేకుమట్ల, ఆంధ్రప్రభ : భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం పంగిడిపల్లి శివారులో పోలీసులు నిర్వహించిన ఆకస్మిక దాడుల్లో 10 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకున్నారు.
చిట్యాల మండలం అందుకుతండ గ్రామానికి చెందిన బుఖ్య వీరన్న వద్ద అక్రమంగా గుడుంబా ఉన్నట్లు గుర్తించి పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ దాడుల్లో 10 లీటర్ల గుడుంబా పట్టుబడగా, సంబంధిత వ్యక్తిపై కేసు నమోదు చేశారు.
ఈ సందర్భంగా ఎస్ఐ అమూల్య మాట్లాడుతూ అక్రమ మద్యం తయారీ, విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు కూడా ఇలాంటి అక్రమ కార్యకలాపాలపై సమాచారం అందించి పోలీసులకు సహకరించాలని సూచించారు.
