మహాకాళి ఆలయాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే, సబ్ కలెక్టర్
మహాకాళి ఆలయాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే, సబ్ కలెక్టర్
బాసర (నిర్మల్ జిల్లా), ఆంధ్రప్రభ : బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవి అమ్మవారి ఉప ఆలయమైన మహాకాళి ఆలయాన్ని మంగళవారం ఉదయం ఎమ్మెల్యే రామారావు పటేల్, భైంసా సబ్ కలెక్టర్ సంకేత్ శర్మ, ఇతర అధికారులు పరిశీలించారు. చోరీ జరిగిన తీరును ఆలయ ఈవో అంజనీదేవి వారికి వివరించారు. మహాకాళి ఆలయ పరిసరాలలోని సీసీ కెమెరాలకు బట్ట కప్పి మరి చోరీకి పాల్పడ్డారు దుండగులు.
ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే రామారావు పటేల్ ఈవోకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు సంజీవ్ పూజారి, సర్పంచ్ వెంకటేశ్ గౌడ్, తహసీల్దార్ పవన్ చంద్ర, ఇతర అధికారులు పాల్గొన్నారు.

