ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ఘన సత్కారం

వికారాబాద్, ఆంధ్రప్రభ : ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని లోక్ భవన్ (రాజ్ భవన్)లో నిర్వహించిన రక్తదాన శిబిరంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వికారాబాద్ జిల్లా చైర్మన్ సాయి చౌదరి 118వ సారి రక్తదానం చేసి మరోసారి తన సేవాభావాన్ని చాటుకున్నారు.

ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల సాయి చౌదరిని అభినందించి ప్రశంసాపత్రం అందజేశారు. సమాజ సేవలో భాగంగా నిరంతరం రక్తదానం చేస్తూ అనేక మందికి ప్రాణదాతగా నిలుస్తున్న ఆయన సేవలను గవర్నర్ ప్రశంసించారు.

సాయి చౌదరి రక్తదాన ఉద్యమాన్ని ప్రోత్సహిస్తూ యువతలో అవగాహన కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటివరకు 118 సార్లు రక్తదానం చేసి అరుదైన ఘనత సాధించిన ఆయన పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా లభించిన ఈ గుర్తింపు తనకు మరింత బాధ్యతను పెంచిందని, భవిష్యత్తులో కూడా రక్తదాన సేవలను కొనసాగిస్తానని సాయి చౌదరి తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *