RajKCReddy | ఏపీ మద్యం స్కామ్‌లో ఈడీ కీలక చర్య
RajKCReddy | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న రాజ్‌కెసిరెడ్డిని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అరెస్ట్ చేశారు.
ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే పలువురిని విచారించిన ఈడీ, తాజాగా రాజ్‌కెసిరెడ్డిని అదుపులోకి తీసుకోవడంతో దర్యాప్తు కీలక మలుపు తిరిగినట్లు భావిస్తున్నారు. అరెస్ట్ అనంతరం ఆయనను మరింత విచారణ కోసం ఈడీ కస్టడీలోకి తీసుకున్నట్లు సమాచారం.
ఏపీ లిక్కర్ స్కామ్‌లో భారీ స్థాయిలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలు ఉన్నాయి. నిధుల మళ్లింపు, మనీలాండరింగ్, హవాలా లావాదేవీల కోణాల్లో కూడా ఈడీ దర్యాప్తు కొనసాగిస్తోంది. రాజ్‌కెసిరెడ్డి అరెస్టుతో కేసులో మరిన్ని కీలక వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు.
