బాబానగర్ గ్రామంలో మృగశిర కార్యక్రమం

బాబానగర్ గ్రామంలో మృగశిర కార్యక్రమం

భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ:

భీమ్‌గల్ మండలంలోని బాబానగర్ గ్రామంలో మృగశిర కార్తెకు ముందు ఆదివారం గ్రామ ప్రజలు గ్రామాభివృద్ధి తరపున మన మొదటి పూజించే పోశమ్మ తల్లి వద్దకు వలగొడుగు ద్వారా వెళ్లి కల్లు,గుడాలు పెట్టి తల్లి మా పాడి పంటలు, మా పిల్లలు, ప్రజలు అందరు బాగుండాలని వర్షాలు సమృద్దిగా కూరవాలని మొదటగా నీకె సమర్పిస్తున్నాము.అని మొక్కడం జరుగుతుంది.

ఈ కార్యక్రమం మా పూర్వికుల నుండి వస్తుంది.మన హిందూ బంధువులందరు ఆచార వ్యవహారాలను కాపాడుకుంటూ మనల్ని మనం రక్షించుకోవాలి. ఈ కార్యక్రమానికి మా గ్రామభివృద్ధి కమిటీ సభ్యులు తోట రమేష్, ధర్పల్లి రాజేశ్వర్, మాణిక్యాల శ్రీనివాస్, కట్ల రవి, సిద్దపల్లి లక్ష్మణ్, సిద్దపల్లి సాగర్, భీమా రవీందర్, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply