గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలి: పీసీసీ చీఫ్‌కు వినతి
గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలి: పీసీసీ చీఫ్‌కు వినతి
భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ:
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌ను భీమ్‌గల్ మండలం బాబాపూర్ గ్రామ ఉపసర్పంచ్ మంద గోవర్ధన్ ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధికి సంబంధించిన పలు సమస్యలు, పెండింగ్ పనులను ఆయన దృష్టికి తీసుకెళ్లి వినతిపత్రం సమర్పించారు.
గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధి, ప్రజలకు అవసరమైన సౌకర్యాల కల్పన కోసం ప్రత్యేక చొరవ తీసుకోవాలని కోరగా, పీసీసీ చీఫ్ సానుకూలంగా స్పందించి పనుల మంజూరుకు కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు.
అనంతరం తాళ్లపల్లి గ్రామ సర్పంచ్ భుక్య హంసిబాయి రాజిరెడ్డి తన కుమార్తె వివాహానికి హాజరుకావాలని కోరుతూ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌కు వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ నెల 17న జరగనున్న వివాహ వేడుకకు విచ్చేసి వధూవరులను ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తాళ్లపల్లి సర్పంచ్ భుక్య హంసిబాయి రాజిరెడ్డి, రహత్‌నగర్ ఉపసర్పంచ్ సేవాలాల్ తదితరులు పాల్గొన్నారు.
