భాష్యం రామకృష్ణకు చిరు సత్కారం

భాష్యం రామకృష్ణకు చిరు సత్కారం

అమరావతి, ఆంధ్రప్రభ:

రాజ్యసభ సభ్యులుగా ఎంపికైన భాష్యం రామకృష్ణ కి పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యసభ సభ్యులుగా ఎంపికైన తమ సోదరులు, భాష్యం రామకృష్ణని పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ గుంటూరు చంద్రమౌళినగర్‌లో కలిసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపి చిరు సత్కారం చేశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలియజేశారు.

రాజ్యసభకు ఎంపిక కావడం పట్ల భాష్యం రామకృష్ణకి ఇది గొప్పగౌరవమని, విద్యారంగం, సామాజిక సేవలో ఆయన అందించిన విశిష్ట సేవలకు గుర్తింపుగా ఈ అవకాశం లభించిందని ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పేర్కొన్నారు. రాజ్యసభ వేదికగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, రాష్ట్ర ప్రయోజనాల సాధనకు ఆయన కీలక పాత్ర పోషిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

అదేవిధంగా రాజ్యసభ సభ్యులుగా ఎంపికైన సానా సతీష్ , చింతకాయల విజయ్ కి కూడా ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మంత్రి లోకేష్ ప్రోత్సాహంతో రాష్ట్ర అభివృద్ధికి, ప్రజల ఆకాంక్షల సాధనకు వారు తమ అనుభవం,సామర్థ్యాన్ని వినియోగిస్తారని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులుగా ఎంపికైన ముగ్గురు నాయకులకు మరోసారిశుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రజాసేవలో మరిన్ని విజయాలు సాధించాలని ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ఆకాంక్షించారు.

Leave a Reply