JC Prabhakar Reddy | పోలీసుల పాత్రపై జేసీ ఫైర్

JC Prabhakar Reddy | పోలీసుల పాత్రపై జేసీ ఫైర్

JC Prabhakar Reddy | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌ : వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించారని టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆరోపించారు. ఎన్నికల సమయంలో టీడీపీ నాయకులను స్వేచ్ఛగా పనిచేయనివ్వకుండా తీవ్రంగా వేధించారని మండిపడ్డారు.

స్థానిక ఎస్సైలు, సీఐలు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించి తమను ఎన్నికల్లో స్వేచ్ఛగా పోటీ చేయనివ్వలేదని జేసీ ఆరోపించారు. ప్రజాస్వామ్య విలువలను కాలరాసి, ప్రతిపక్ష నాయకులపై ఒత్తిడి తెచ్చారని విమర్శించారు.

ఎన్నికల సమయంలో పైస్థాయి నుంచి వచ్చిన ఆదేశాల మేరకు టీడీపీ నాయకులను హౌస్ అరెస్టులకు గురిచేశారన్నారు. నామినేషన్లు దాఖలు చేసే దశ నుంచే అడ్డంకులు సృష్టించారని, కొన్ని చోట్ల రిగ్గింగ్ కూడా జరిగిందని ఆరోపించారు.

పోలీసు యూనిఫాం ప్రజలను రక్షించడానికి ఇచ్చారని, అధికార పార్టీకి సేవ చేయడానికి కాదని జేసీ వ్యాఖ్యానించారు. ‘‘రేపు మీ పిల్లలు కూడా ఎస్సైలు, సీఐలు కాకపోవచ్చు. సాధారణ ప్రజలుగా ఉంటారు. అప్పుడు వారికి ఇలాంటి సమస్యలు వస్తే ఎవరు పరిష్కరిస్తారు?’’ అంటూ ప్రశ్నించారు.

Leave a Reply