గీత కార్మికునికి తీవ్రగాయాలు..

గీత కార్మికునికి తీవ్రగాయాలు..

పరిహారం ఇప్పించాలని వినతి..
జన్నారం, ఆంధ్రప్రభ ;
మంచిర్యాల జిల్లా జన్నారం మండలం ఇందనపల్లి వాసి, గీతాకార్మికుడు గాజుల నారాయణ గౌడ్ ఈత చెట్టు పై నుంచి పడగా తీవ్ర గాయాలు అయ్యాయి. అతను శనివారం సాయంత్రం ఈత చెట్టు ఎక్కి కల్లు గీస్తున్న తరుణంలో మోకుజారడంతో చెట్టు పైనుంచి క్రింద పడి పోయాడు. దీంతో అతనికి రెండు చేతులు విరిగి తీవ్ర గాయాలయ్యాయి. హుటాహుటిన అతన్ని కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం మంచిర్యాల ఆసుపత్రికి తరలించి, చికిత్స చేయించారు. పేద గీత కార్మికుడైనందున ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి, ఆదుకోవాలని మండల గౌడ సంఘం అధ్యక్ష, ఉపాధ్యక్షులు మూల భాస్కర్ గౌడ్, నారాయణ గౌడ్ కోరారు.

Leave a Reply