7thJuneeditorial | ఇజ్రాయెల్‌పై అమెరికా అనుమానాలు

7thJuneeditorial | ఇజ్రాయెల్‌పై అమెరికా అనుమానాలు

7thJuneeditorial | గూఢచర్య ముప్పుపై రక్షణ శాఖ అప్రమత్తం
ఇరాన్ యుద్ధం తర్వాత పెరుగుతున్న విభేదాలు
దౌత్య మార్గాల వైపు అమెరికా అడుగులు

7thJuneeditorial | ఇజ్రాయెల్ కోసం అమెరికా ఎన్నో మాటలు పడింది. అవమానాలకు గురైంది. ఇజ్రాయెల్‌కు అమెరికా అండగా నిలబడుతూ వస్తోంది. అయినప్పటికీ, అమెరికాను ఇజ్రాయెల్ అనుమానిస్తోంది. ఇజ్రాయెల్ గురించి ప్రపంచంలోని దేశాలు ఎన్ని వాస్తవాలు చెప్పినా, అమెరికా నమ్మలేదు. ఇజ్రాయెల్ ఒత్తిడిపైనే అమెరికా ఇరాన్‌పై దాడి చేసింది. ఇరాన్‌పై దాడి కారణంగా అమెరికా వేలాది మంది సైనికులను కోల్పోయింది. కోట్లాది డాలర్ల విలువైన డ్రోన్లు, క్షిపణులను కోల్పోయింది. ఇరాన్‌పై యుద్ధంలో అమెరికా రక్షణ శాఖకు చెందిన ఆయుధాగారాలు ఖాళీ అయ్యాయి.

ఇజ్రాయెల్ కోసం అమెరికా ఇంతగా చేస్తున్నా, అమెరికాను ఇజ్రాయెల్ అనుమానిస్తోంది. ఇజ్రాయెల్ నుంచి గూఢచర్య ముప్పు ఉన్నట్లు ఎట్టకేలకు అమెరికా గుర్తించింది. ఇందుకు సంబంధించి తమ రక్షణ శాఖలోని అన్ని విభాగాలను అప్రమత్తం చేసింది. ఇరాన్‌పై ఇక యుద్ధం ఆపేద్దామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇచ్చిన సలహాను ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ పెడచెవిన పెట్టారు. అసలు మీ కారణంగానే మేం యుద్ధంలోకి దిగామంటూ నెతన్యాహూతో ఫోన్ సంభాషణల్లో ట్రంప్ తీవ్రంగా మాట్లాడినట్లు వార్తలు వచ్చాయి.

అమెరికాలోని ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వ అధికారుల నుంచి తాము ఎటువంటి సమాచారాన్ని సేకరించడం లేదని వాషింగ్టన్‌లోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం స్పష్టం చేసింది. ఈ రెండు దేశాల మధ్య స్నేహ సంబంధాలు దశాబ్దాలుగా కొనసాగుతున్నాయని, వాటిని ఎవరూ చెడగొట్టలేరని అమెరికా రాయబార కార్యాలయం కూడా స్పష్టం చేసింది. మరి అలాంటప్పుడు, ఈ వార్తలు ఎలా వచ్చాయి? ఇందుకు అమెరికన్ గూఢచార వర్గాలు సమాధానం చెబుతున్నాయి.

ఇజ్రాయెల్ గూఢచార వర్గాలు తమ దేశానికి సంబంధించిన రహస్య సమాచారాన్ని సేకరిస్తున్నాయని, యుద్ధంలో వాటిల్లిన నష్టాలన్నీ తమ దేశం వల్లనే జరిగాయని నింద మోపేందుకు అమెరికా ప్రయత్నిస్తోందని ఇజ్రాయెల్ అధికార వర్గాలు పేర్కొన్నాయి. తాత్కాలిక అవసరాల కోసం వినియోగించే బర్నర్ ఫోన్లు, ప్రీపెయిడ్ ఫోన్ల సిమ్ కార్డులను దగ్ధం చేస్తుంటారు. అలాంటి వాటిని ఆధారంగా చేసుకుని అమెరికన్ వర్గాలు గూఢచర్యం చేస్తున్నాయేమోనన్న అనుమానాన్ని ఇజ్రాయెల్ అధికారులు వ్యక్తం చేస్తున్నారు.

అసలు విషయం ఏమిటంటే, ఇరాన్‌పై యుద్ధాన్ని ఏ ప్రయోజనం కోసం తలపెట్టామో, అది పూర్తిగా నెరవేరింది కనుక ఇక ఆపేద్దామని నెతన్యాహూతో ఇప్పటికి ఎన్నోసార్లు ట్రంప్ అన్నారని, అందుకు భిన్నంగా ఇజ్రాయెల్ లెబనాన్‌పై దాడులు ఆపాలని అమెరికా అడుగుతున్నదని వారంటున్నారు. అయినా ఇజ్రాయెల్ పెడచెవిన పెడుతుండటంతో మళ్లీ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయని, లెబనాన్ జరిపే దాడులకు అమెరికా సంసిద్ధం కావలసి వస్తోందని, అమెరికా ఆయుధాగారం ఇప్పటికే ఖాళీ అయిన నేపథ్యంలో ఇంకా క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించడం కష్టసాధ్యంగా ఉందని అమెరికన్ వర్గాలు పేర్కొంటున్నాయి.

అమెరికా మిత్రదేశాల్లోని ఇతర దేశాలు ఇజ్రాయెల్ చెప్పుడు మాటల వల్లనే ట్రంప్ ఈ యుద్ధాన్ని తెచ్చి పెట్టారంటూ మొదటి నుంచి ఎద్దేవా చేస్తున్నాయి. ఈ యుద్ధం వల్ల అమెరికా ఆర్థికంగా బాగా నష్టపోయింది. దౌత్యమార్గాల ద్వారానే ఇరాన్‌తో సమస్యలను పరిష్కరించుకోవాలని భావిస్తోంది.

Leave a Reply