బిజెపి పార్టీ గ్రామ గ్రామాన బలోపేతం..

బిజెపి పార్టీ గ్రామ గ్రామాన బలోపేతం..


కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతో గ్రామాలు సస్యశ్యామలం..
కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరిద్దాం..
బిజెపి పార్టీ జిల్లా అధ్యక్షుడు..

నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : జిల్లాలోని 29 మండలాలలో గ్రామ గ్రామాన బిజెపి పార్టీని సంస్థగతపరంగా అభివృద్ధి చేసి ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేయాలని నాయకులకు బిజెపి జిల్లా అధ్యక్షుడు అభిరుచి మధు పేర్కొన్న రు. గురువారం జిల్లాలోని బనగానపల్లె నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి చర్యలు చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధుల వినియోగానికి ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు.మండల అధ్యక్షులు,హరికృష్ణ, యాదగిరి కమిటీ సభ్యులు తో దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం గత 12 సంవత్సరాల కాలంలో రాష్ట్రవ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరించాలని సూచించారు.

కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రతి నాయకుడు కృషి చేయాలి అన్నారు. జరిగిన అభివృద్ధి ని ప్రజలకు వివరించి పార్టీ బలోపేతం కొరకు కృషి చేయాలని పిలుపు నిచ్చారు. ఇటీవల కాలంలో పార్టీలో పలువురు చేరటం పార్టీ బలోపేతానికి నిదర్శనం అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లింగన్న, జిల్లా ప్రధాన కార్యదర్శి శివకృష్ణ, జిల్లా కార్యదర్శులు నాగమోహన్, శరత్ చంద్ర, చాందిని, హరికృష్ణ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply