trump-congress-shock-iran-war-resolution-house-vote I 4626 I ఇరాన్ యుద్ధంపై కాంగ్రెస్ షాక్‌..

ఇర‌కాటంలో ట్రంప్‌
ఇరాన్ యుద్ధానికి వ్యతిరేకంగా ప్రతినిధుల సభ తీర్మానం ఆమోదం
కాంగ్రెస్ అనుమతి లేకుండా ఇరాన్‌పై సైనిక చర్యలు కొనసాగించకూడదు
తీర్మానానికి న‌లుగురు రిపబ్లికన్ల మద్దతు
ఈ తీర్మానానికి చ‌ట్ట‌ప‌ర‌మైన హ‌క్కు లేదు
ఉక్రెయిన్ సహాయ బిల్లుకు గ్రీన్ సిగ్నల్
ఇజ్రాయెల్ ను అదుపు చేస్తే యుద్ధం ఆగుతుంది
ట్రంప్ మాట ఇజ్రాయెల్ వింటుందా?

trump-congress-shock-iran-war-resolution-house-vote

trump-congress-shock-iran-war-resolution-house-vote I 4626 ఆంధ్ర‌ప్ర‌భ వెబ్, అంత‌ర్జాతీయం : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు కాంగ్రెస్ షాకిచ్చింది. యుద్ధం ఆపాల్సిందే అని సంకేతాలు ఇచ్చింది. హౌస్ ఆఫ్ రెప్రెజెంటేటివ్స్ లో డెమోక్రాట్ల ప్రవేశపెట్టిన యుద్ధ అధికారాల (వార్ పవర్స్) తీర్మానానికి అధికార రిప‌బ్లిక‌న్ పార్టీకి చెందిన న‌లుగురు మ‌ద్దతు ఇచ్చారు. ఈ క్ర‌మంలో ఇరాన్‌-అమెరికా, ఇజ్రాయెల్ మ‌ధ్య యుద్ధం ఆగుతుందా? అనేది ప్ర‌పంచ దేశాల్లో చ‌ర్చ జ‌రుగుతుంది.

అమెరికాలోనే ట్రంప్ తీరును సొంత పార్టీకి చెందిన న‌లుగురు వ్య‌తిరేకిస్తున్నారు. మ‌రి కొంద‌రు రిప‌బ్లిక‌న్ పార్టీ స‌భ్యులు కూడా ట్రంప్ తీరును ఎండ‌గ‌డుతున్నార‌ని స‌మాచారం. అయితే ఇంకా వారెవరూ బ‌య‌ట‌ప‌డ‌లేదు. ఇదే ప‌రిస్థితి కొన‌సాగితే ట్రంప్ ఇర‌కాటంలో ప‌డ‌క త‌ప్ప‌దు.

అమెరికాలో వ్య‌తిరేక‌త వ‌స్తుంద‌ని గ్ర‌హించిన‌ అధ్య‌క్షుడు ట్రంప్ ఇటీవ‌ల ఇజ్రాయెల్ ప్ర‌ధాని నేత‌న్యాహుపై మండిప‌డ్డారు. శాంతి చ‌ర్చ‌లు జ‌రుగుతున్న స‌మ‌యంలో ఇజ్రాయెల్ ప్ర‌ధాని తీరుతో వాటికి భంగం క‌లుగుతుంద‌ని అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు. నేత‌న్యాహుపై చెడ్డ పేరు ఉంద‌ని, నేను లేక‌పోతే అరెస్టు అయ్యేవాడ‌ని గ‌ట్టిగా అన్నారు. అంటే అమెరికా వ్య‌తిరేక‌త ఎక్కువ అవుతుంద‌ని గ్ర‌హించిన ట్రంప్ ఇజ్రాయెల్ తీరు ఎండ‌గ‌ట్టిన‌ట్లు ప‌రీశీల‌కులు భావిస్తున్నారు.

trump-congress-shock-iran-war-resolution-house-vote I 4626 215–208 ఓట్ల తేడాతో ఆమోదం
ప్రతినిధుల సభ విదేశాంగ వ్యవహారాల కమిటీలో అగ్రశ్రేణి డెమోక్రాట్ అయిన గ్రెగరీ మీక్స్ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. కాంగ్రెస్ అనుమతి లేకుండా ఇరాన్‌పై సైనిక చర్యలు కొనసాగించకూడదని, అమెరికా సాయుధ దళాలను వెనక్కి పిలవాలని ఇందులో సూచించారు. ఈ తీర్మానానికి న‌లుగురు రిప‌బ్లిక‌న్ స‌భ్యులు మ‌ద్ద‌తు ఇవ్వ‌డ‌వంతో 215–208 ఓట్ల తేడాతో ఆమోదం పొందింది. అయితే తీర్మానానికి చట్టపరమైన హ‌క్కు లేకపోవడంతో ఇది ప్రధానంగా రాజకీయ సందేశంగా మాత్రమే పరిగణించబడుతోంది.

trump-congress-shock-iran-war-resolution-house-vote ట్రంప్ సొంత పార్టీ లో విభేదాలు

trump-congress-shock-iran-war-resolution-house-vote


డెమోక్రాట్లందరూ తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయగా, రిపబ్లికన్ పార్టీకి చెందిన బ్రియన్ ఫిట్జ్‌పాట్రిక్, థామస్ మాసీ, టామ్ బారెట్, వారెన్ డేవిడ్సన్ కూడా మద్దతు తెలిపారు. దీంతో ట్రంప్ విదేశాంగ విధానాలపై సొంత పార్టీలోనే విభేదాలు ఉన్నాయనే సంకేతాలు వెలుగుచూశాయి. హౌస్ స్పీకర్ మైక్ జాన్సన్‌తో పాటు ఎక్కువ మంది రిపబ్లికన్లు ఈ తీర్మానాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఇరాన్‌తో అణు ఒప్పందం కోసం చర్చలు కొనసాగుతున్న సమయంలో ఇలాంటి తీర్మానం అధ్యక్షుడి చర్చా సామర్థ్యాన్ని బలహీనపరుస్తుందని వారు ఆరోపించారు. విదేశాంగ వ్యవహారాల కమిటీ చైర్మన్ బ్రియాన్ మాస్ట్ మాట్లాడుతూ, “ఇది కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం తెచ్చిన ఓటింగ్ మాత్రమే” అని వ్యాఖ్యానించారు.

trump-congress-shock-iran-war-resolution-house-vote సెనెట్‌లోనూ వేడి చర్చ
ఇదే తరహా వార్ పవర్స్ తీర్మానం అమెరికా సెనెట్‌లో కూడా పెండింగ్‌లో ఉంది. సెనెట్ ప్రతిపాదన మరింత కఠినమైనదిగా భావిస్తున్నారు. కాంగ్రెస్ అనుమతి లేకుండా యుద్ధాన్ని కొనసాగించకుండా అధ్యక్షుడిని నిర్బంధించే అవకాశం అందులో ఉంది. అయితే అది చట్టంగా మారాలంటే రెండు సభల ఆమోదంతో పాటు అధ్యక్షుడి సంతకం కూడా అవసరం.

trump-congress-shock-iran-war-resolution-house-vote

trump-congress-shock-iran-war-resolution-house-vote ఉక్రెయిన్‌కు సహాయంపై మరో కీలక నిర్ణయం
అదే రోజు ప్రతినిధుల సభ ఉక్రెయిన్‌కు సహాయం అందించే బిల్లును ముందుకు తీసుకురావడానికి కూడా అనుమతి ఇచ్చింది. 218–204 ఓట్లతో ఆమోదం పొందిన ఈ నిర్ణయం ద్వారా సభ నాయకత్వాన్ని పక్కనబెట్టి బిల్లును నేరుగా చర్చకు తీసుకురావడానికి మార్గం సుగమమైంది. డెమోక్రాట్లతో పాటు కొందరు రిపబ్లికన్లు కూడా ఈ చర్యకు మద్దతు తెలిపారు. ఉక్రెయిన్‌కు మద్దతు కొనసాగించాలనే అమెరికా కాంగ్రెస్ సంకల్పాన్ని ఈ ఓటింగ్ ప్రతిబింబిస్తోందని గ్రెగరీ మీక్స్ పేర్కొన్నారు.

trump-congress-shock-iran-war-resolution-house-vote ట్రంప్ మాట ఇజ్రాయెల్ వింటుందా?
అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ మాట ఇజ్రాయెల్ వింటుందా? అనేది ప్ర‌ధాన చ‌ర్చ‌గా మారింది. ఒక ప‌క్క శాంతి చ‌ర్చ‌లు జ‌రుగుతుంటే మ‌రో వైపు ఇజ్రాయెల్ దాడుల‌కు పాల్ప‌డుతుంది. దీనిపై ఇరాన్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ శాంతి చ‌ర్చ‌లు నిలిపి వేసింది. అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ ఇటీవ‌ల గ‌ట్టిగా మాట్లాడినా ఇజ్రాయెల్ ప్ర‌ధాని నేత‌న్యాహు పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. అమెరికాలో పెర‌గుతున్న వ్య‌తిరేక‌తో ట్రంప్ ఎలాంటి చ‌ర్య తీసుకోబోతారు అనేది ప్ర‌శ్న‌.

ఇదీ కూడా చ‌ద‌వండి : అమెరికా యూట‌ర్న్

ఇదీ కూడా చ‌ద‌వండి : ఇజ్రాయెల్‌పై అమెరికా, ఇరాన్ దూకుడు

Leave a Reply