ఉమామహేశ్వర ఆలయ పాలకవర్గం ప్రమాణస్వీకారం

ఉమామహేశ్వర ఆలయ పాలకవర్గం ప్రమాణస్వీకారం

  • రెండోసారి చైర్మన్‌గా మాధవరెడ్డి
  • అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే భూమిపూజ

అచ్చంపేట,ఆంధ్రప్రభ : నాగర్‌కర్నూల్ జిల్లా, అచ్చంపేట మండలం, రంగాపూర్ గ్రామ సమీపంలోని నల్లమల కొండలపై వెలసిన శ్రీశైలం ఉత్తర ద్వారంగా ప్రసిద్ధి చెందిన శ్రీ ఉమామహేశ్వర ఆలయంలో రెండోసారి పాలకమండలి ప్రమాణస్వీకార కార్యక్రమం బుధవారం ఘనంగా జరిగింది. ఆలయ ఈవో శ్రీనివాసులు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆలయ చైర్మన్‌గా రెండోసారి బీరం మాధవరెడ్డి ప్రమాణస్వీకారం చేయగా, పాలకమండలి సభ్యులుగా దాశరథి పవన్, వెంకటయ్య, శేఖర్‌రెడ్డి, ఇందిరమ్మ, శ్రీనివాసులు, సంబు శోభ, నోముల తిరుపతయ్య, సురేందర్, రావు, మల్లేష్ చారి, మత్రు నాయక్, దశరథం, సైదులు, లక్ష్మయ్యలు బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆలయ క్షేత్ర అభివృద్ధి కోసం కోటి రూపాయల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులు, సీసీ రోడ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే వంశీకృష్ణ భూమిపూజ చేశారు. ఆలయ అభివృద్ధికి పాలకమండలి సభ్యులు కృషి చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే వంశీకృష్ణ సూచించారు.

Leave a Reply