పచ్చిరొట్టె విత్తనాలు పంపిణీకి సిద్ధం..

పచ్చిరొట్టె విత్తనాలు పంపిణీకి సిద్ధం..

ఎంఏఓ అంజిత్ కుమార్

జన్నారం, ఆంధ్రప్రభ : పచ్చి రొట్టె విత్తనాలు మండలంలోని పలు విత్తన కేంద్రాలలో పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని స్థానిక ఇన్చార్జి వ్యవసాయ శాఖ అధికారి(ఎంఎఓ)గొర్ల అంజిత్ కుమార్ తెలిపారు.సోమవారం మధ్యాహ్నం ఆయన మాట్లాడుతూ..ఖరీఫ్ సీజన్ కు పచ్చి రొట్టె విత్తనాలను ప్రభుత్వం సబ్సిడీపై అందజేస్తుందన్నారు. పిల్లిపెసర, జిలుగు, జనుము విత్తనాలను అందుబాటులో ఉన్నాయని, జిలుగు విత్తనాలు 30 కిలోల బస్తా ఒక్కంటికి రూ.2452.50, జనుము విత్తనాలు 40 కిలోల బస్తా ఒక్కంటికి రూ.3110, పిల్లిపెసర విత్తనాలు 20 కిలోల బస్తా ఒక్కంటికి రూ.1970 చొప్పునరైతులకుఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు.

ఒక్క బస్తా విత్తనాలు 2.5 ఎకరాల వరకు వేయవచ్చని,విత్తనాలు కావలసిన రైతులు క్లస్టర్ వ్యవసాయ విస్తరణ అధికారికి పట్టా పాస్ బుక్కు,ఆధార్ జిరాక్స్ ప్రతులు ఇచ్చి, డబ్బులు చెల్లించి పొనకల్, చింతగూడ సింగల్ విండో కార్యాలయాల్లో, ఇందనపల్లి డీసీఎంఎస్,జన్నారం (పొనకల్),మురిమడుగు అగ్రోస్ కేంద్రాలలో విత్తనాల బస్తాలు పొందాలనిఆయనచెప్పారు.ఈ అవకాశాన్ని రైతులువినియోగించుకోవాలని ఆయన సూచించారు.

Leave a Reply