Ramcharan | టికెట్ రేట్లు, షో టైమ్ ఫిక్స్.?

Ramcharan | టికెట్ రేట్లు, షో టైమ్ ఫిక్స్.?

Ramcharan | పెద్ది ప్రీమియర్ టికెట్ ధర ఎంత?
రాత్రి నుంచే ప్రారంభం కానున్న ప్రీమియర్ షోస్
వసూళ్లపై భారీ అంచనాలు

Ramcharan | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ నటించిన భారీ, క్రేజీ మూవీ పెద్ది రిలీజ్ దగ్గరపడుతున్న కొద్దీ అభిమానుల్లో ఎక్స్‌పెక్టేషన్స్ మరింత పెరుగుతున్నాయి. ఇప్పటికే టాలీవుడ్ ట్రేడ్ వర్గాల్లో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా జూన్ 3 నుంచి ప్రారంభం కానున్న ప్రీమియర్ షోస్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఏపీలో ప్రీమియర్స్‌కు సంబంధించిన టికెట్ రేట్లు, షో టైమింగ్స్‌ పై క్లారిటీ వచ్చేసిందని టాక్ వినిపిస్తోంది. ఇంతకీ.. టిక్కెట్ రేటు ఎంత..? షో టైమ్ ఎప్పుడు..?

Ramcharan | పెద్ది ప్రీమియర్ టికెట్ ధర ఎంత?

ఆంధ్రప్రదేశ్‌లో పెద్ది ప్రీమియర్ షోలకు టికెట్ ధరను రూ.600గా నిర్ణయించినట్టు సమాచారం. మొదట భారీ రేంజ్‌లో ధరలు ఉండొచ్చని ప్రచారం జరిగినా, అభిమానులకు అందుబాటులో ఉండేలా మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. జూన్ 3 ప్రీమియర్స్‌కు ఈ ప్రత్యేక రేటు అమల్లో ఉండనుండగా, తరువాత రెగ్యులర్ హైక్స్‌తో థియేటర్లలో సినిమా ప్రదర్శన కొనసాగనుంది.

Ramcharan

Ramcharan | రాత్రి నుంచే ప్రారంభం కానున్న ప్రీమియర్ షోస్

సాధారణంగా స్టార్ హీరోల సినిమాల ప్రీమియర్ షోలు అర్ధరాత్రి తర్వాత లేదా తెల్లవారుజామున ప్రారంభమవుతుంటాయి. కానీ పెద్ది విషయంలో మాత్రం పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. ఏపీలో ఈ సినిమా ప్రీమియర్ షోలు రాత్రి 8 గంటల నుంచే ప్రారంభం కానున్నట్టు సమాచారం. ఇది చాలా అరుదైన నిర్ణయంగా చెప్పాలి. అయితే.. సినిమాపై ఉన్న కాన్ఫిడెన్స్‌తోనే మేకర్స్ ఈ స్టెప్ తీసుకున్నారని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

Ramcharan

Ramcharan | వసూళ్లపై భారీ అంచనాలు

మొత్తానికి ప్రీమియర్ షోల నుంచే పెద్ది బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అభిమానుల స్పందన, అడ్వాన్స్ బుకింగ్స్‌ను చూస్తుంటే.. ఓపెనింగ్స్ మాత్రం భారీగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే చరణ్ గత చిత్రం గేమ్ ఛేంజర్ డిజాస్టర్ అవ్వడంతో ఈ సినిమాతో ఎలాగైనా సరే.. బ్లాక్ బస్టర్ సాధించాలని మెగా అభిమానులే కాదు.. రామ్ చరణ్ కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నాడు. మరి.. పెద్ది బాక్సాఫీస్ దగ్గర ఏ రేంజ్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో.. ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.

Ramcharan

CLICK HERE TO READ AScriptofGod | ‘త్రికాల’ మూవీ రివ్యూ

CLICK HERE TO READ MORE

Leave a Reply