sangareddy | బీరప్ప స్వామి కళ్యాణంలో పాల్గొన్న ఎమ్మెల్యే చింతా

sangareddy | బీరప్ప స్వామి కళ్యాణంలో పాల్గొన్న ఎమ్మెల్యే చింతా

sangareddy | ఉమ్మడి మెదక్ బ్యూరో, ఆంధ్ర ప్రభ : సంగారెడ్డి జిల్లా ఫసల్వాది గ్రామ శివారులో కొలువైన బీరప్ప స్వామి-కామారతి కళ్యాణ మహోత్సవంలో సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికి శాలువాతో సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ గ్రామాల్లో సంప్రదాయ ఆధ్యాత్మిక వేడుకలు ప్రజల్లో ఐక్యతను పెంపొందిస్తాయని అన్నారు. స్వామివారి ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, చింత సాయినాథ్, గ్రామ సర్పంచ్ హరిప్రసాద్, మండల పార్టీ అధ్యక్షుడు చక్రపాణి, శ్రవణ్ రెడ్డి, వాజిత్, కౌన్సిలర్ సోము తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply