వ్యవసాయ కార్మిక సంఘం మండల కమిటీ ఎన్నిక

వ్యవసాయ కార్మిక సంఘం మండల కమిటీ ఎన్నిక

మోత్కూర్, ఆంధ్రప్రభ: మండలంలోని పాలడుగులో జరిగిన వ్యవసాయ కార్మిక సంఘం మండల మహాసభలో అధ్యక్షులుగా పిట్టల చంద్రయ్య, కార్యదర్శి గా కురిమేటి యాదయ్యతో పాటు అరుగురిని కమిటీ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతనంగా అధ్యక్ష కార్యదర్శులుగా ఎన్నికైన పిట్టల చంద్రయ్య, కురిమేటి యాదయ్య గార్లు మాట్లాడుతూ గ్రామాలలో పేదలకు స్థానికంగా ఉపాధి కల్పిస్తున్న ఉపాధిహామీ చట్టాన్ని కేంద్రంలోని మోడీ ప్రభుత్వం నిర్వీర్యం చేసే కుట్ర చేస్తుందన్నారు. ఉపాధి హామీ చట్ట రక్షణకు ప్రజలను చైతన్యం చేసి, నిత్యం వ్యవసాయ కూలీల సమస్యలపై ఉద్యమాలు నిర్వహిస్తూ, సంఘబలోపేతం చేసెందుకు కృషి చేస్తామన్నారు.