బీజేపీ నేత కుసుమ సతీష్‌ను పరామర్శించిన గంటా రవికుమార్

కరీమాబాద్, ఆంధ్రప్రభ : బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కుసుమ సతీష్‌ను బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంటా రవికుమార్ మంగళవారం పరామర్శించారు. ఈ నెల 3న జరిగిన బైక్ ప్రమాదంలో సతీష్ చేతి, కాలికి తీవ్ర గాయాలు కావడంతో, కరీమాబాద్‌లోని వారి నివాసానికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా వైద్యుల సూచనల మేరకు తగిన జాగ్రత్తలు పాటిస్తూ త్వరగా కోలుకుని మళ్లీ ప్రజాసేవలో నిమగ్నం కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు గడల కుమార్, కనుకుంట్ల రంజిత్ కుమార్, మాచర్ల దীনదయాళ్, శివనగర్ మండల అధ్యక్షుడు మహమ్మద్ రఫీ, కరీమాబాద్ మండల ప్రధాన కార్యదర్శి వంచనగిరి రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.