పదిలో సత్తా చాటిన శ్రీరామ్ స్కూల్

పదిలో సత్తా చాటిన శ్రీరామ్ స్కూల్

పాయకాపురం, ఆంధ్రప్రభ : విజయవాడ అజిత్ సింగ్ నగర్ లోని శ్రీరామ్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ విద్యార్థులు పదో తరగతిలో అద్భుత ఫలితాలు సాధించారు.ఎం దుర్గా కాజల్ బాయి 600 మార్కులకు గాను 595 మార్కులను, జి. ఝాన్సీ సాయి దర్శిని 600 మార్కులకు 590 మార్కులను సాధించి సత్తా చాటారు. పదో తరగతి పరీక్ష ఫలితాలలో అద్భుత విజయం సాధించిన సందర్భాన్ని పురస్కరించుకుని శ్రీరామ్ స్కూల్ వద్ద విద్యార్థులు, ఉపాధ్యాయులు సంబరాలు చేసుకున్నారు. నృత్యాలు చేస్తూ సందడి చేసారు. బాణాసంచా కాల్చి మిఠాయిలు పంచి ఫలితాల పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా స్కూల్ కరస్పాండెంట్,ప్రిన్సిపల్ బోని సురేష్ కుమార్ మాట్లాడుతూ పదో తరగతి పరీక్ష ఫలితాల్లో శ్రీరామ్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ విజయదుందుభి మోగించిందన్నారు. ఈ ఏడాది పదో తరగతి ప్రశ్న పత్రాలు కొంచెం కష్టమైనా తమ విద్యార్థులు మాత్రం స్కూల్ ప్రమాణాలు ఉన్నత స్థాయిలో ఉన్నాయని నిరూపిస్తూ 600 మార్కులకు 595 మార్కులను ఎం దుర్గా కాజల్ బాయి, 590 మార్కులను జి. ఝాన్సీ సాయి దర్శిని సాధించారని చెప్పారు.

25 మందికి పైగా విద్యార్థులు 550 మార్కులకు పైన సాధించారని తెలిపారు. 139 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తే 70 మంది విద్యార్థులకు 500 మార్కులకు పైన సాధించారని చెప్పారు. 98 శాతం ఉత్తీర్ణతతో ఓ ప్రభంజనం సృష్టించిందని తెలిపారు. దీనికి కారణమైన విద్యార్థులు, తీర్చిదిద్దిన ఉపాధ్యాయులు, వెన్నుదన్నుగా నిలిచిన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. స్కూల్ డైరెక్టర్ బోని మాధురి మాట్లాడుతూ తమ పాఠశాలలో పదో తరగతి పరీక్ష ఫలితాలలో గర్వించదగిన రీతిలో విద్యార్థులు మార్కులు సాధించడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తూ విద్యార్థులను అభినందించారు.

విద్యార్థులను చదువు ఒక్కటే కాకుండా అన్ని రంగాల్లో ప్రోత్సాహాన్ని ఇచ్చి, అన్ని రంగాల్లో రాణించేలా తీర్చిదిద్దుతున్నామని అన్నారు. అకాడెమిక్స్ లో ఉపాధ్యాయులు ప్రిన్సిపాల్ ప్రణాలికను అనుసరిస్తూ విద్యార్థులు మంచి విజయాలు సాధించేలా కృషి చేస్తున్నారని చెప్పారు. పాఠశాల లో క్రమశిక్షణతో కూడిన విద్యా బోధన, ప్రిన్సిపల్, ఉపాధ్యాయుల బోధన నైపుణ్యంతోనే తమకు మంచి మార్కులు లభించినట్లు దుర్గా కాజల్ బాయి , ఝాన్సీ సాయి దర్శిని వివరించారు.

Leave a Reply