ఎరువుల దుకాణాల బంద్ విజయవంతం

ఎరువుల దుకాణాల బంద్ విజయవంతం

నేరేడుచర్ల , ఆంధ్రప్రభ: ఎరువుల దుకాణదారుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం చేపట్టిన దేశ వ్యాప్త ఎరువుల దుకాణాల బంద్ సూర్యాపేట జిల్లా నేరేడుచర్లలో విజయవంతమైంది. ఎరువుల ఉత్పత్తిదారులు సరఫరాపై రవాణా చార్జీల పై హామీ ఇవ్వాలని, లింకు ప్రొడక్ట్స్ లేకుండా ఎరువులు సరఫరా చేయాలని, డీలర్ల మార్జిన్ పెంచాలని, హెచ్.టి.బి.టి కాటన్ ఎక్స్పైరీ నిల్వల శాంపిల్ కలెక్షన్ కొత్త చట్టాల పై శిక్షల లాంటి సమస్యలు పరిష్కరించాలని ఒకరోజు దుకాణాలను బందు చేసి దుకాణాల ముందు నిరసన వ్యక్తం చేశారు. ఈ బందులో స్థానిక ఎరువుల డీలర్లు దుకాణాల యజమానులు పాల్గొన్నారు.

Leave a Reply