చిన్న గూడూరులో ఎస్ఐ బదిలీపై గ్రామస్తుల సంబరాలు

చిన్న గూడూరులో ఎస్ఐ బదిలీపై గ్రామస్తుల సంబరాలు
సైకో ఎస్సై నుంచి మా గ్రామం విముక్తి పొందింది” – గ్రామస్తులు
చిన్న గూడూరు, ఆంధ్రప్రభ : మహబూబాబాద్ జిల్లా చిన్న గూడూరు మండల కేంద్రంలో ఎస్ఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి బదిలీ నేపథ్యంలో గ్రామంలో సంబరాలు వెల్లివిరిశాయి. గ్రామస్తులు బాణాసంచా పేల్చుతూ పండుగ వాతావరణంలో ఆనందం వ్యక్తం చేశారు. కొంతకాలంగా కక్షపూరితంగా వ్యవహరిస్తూ, ప్రశ్నించిన వారిపై దాడులు చేయడం, అక్రమ కేసులు నమోదు చేయడం వంటి ఆరోపణలు ఎదుర్కొన్న ఎస్ఐ బదిలీ కావడంతో గ్రామంలో ఉత్సాహం నెలకొంది. అంతేకాకుండా, పరిధి దాటి ఇతర గ్రామాల వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటూ రాజకీయంగా వ్యవహరించడం, ఇతర అధికారుల పనుల్లోనూ జోక్యం చేసుకోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడినట్లు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.
అన్ని గ్రామాల్లో రాజకీయాలు చేస్తూ, ఇతర అధికారుల డ్యూటీలు కూడా తనే నిర్వహిస్తున్నట్టు వ్యవహరించేవాడు. దీనివల్ల సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇప్పుడు ఆయన బదిలీ కావడంతో గ్రామానికి ఉపశమనం లభించింది. సైకో ఎస్సై నుంచి మా గ్రామం విముక్తి పొందింది అని గ్రామస్తులు గంగాధరి అనిల్, నీలం శంకరయ్య తెలిపారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తూ పండుగలా జరుపుకున్నారు. ఎస్ఐ బదిలీకి సంబంధించి చర్యలు తీసుకున్న తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి, మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డాక్టర్ శాబరీష్‌లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.


