సంగారెడ్డి నూతన కలెక్టర్గా ప్రతీక్ జైన్ బాధ్యతల స్వీకారం

సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : సంగారెడ్డి జిల్లా నూతన కలెక్టర్గా ఐఏఎస్ అధికారి ప్రతీక్ జైన్ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సాధారణ కార్యక్రమంలో ఆయన పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ప్రతీక్ జైన్ మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వ పథకాల సమర్థవంతమైన అమలుకు ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు.
ప్రజలకు పారదర్శకమైన, వేగవంతమైన సేవలు అందించేందుకు అధికారులు పనిచేయాలని సూచించారు. జిల్లా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో అన్ని శాఖల సమన్వయం కీలకమని పేర్కొన్నారు. ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించడమే తన లక్ష్యమని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ ఆర్డీ మాధురి, జిల్లా అధికారులు కలెక్టర్ కు స్వాగతం పలికారు.
