రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

వత్సవాయి, ఆంధ్రప్రభ : రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని లింగాల గ్రామం వద్ద చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం… వైరా వెళ్తున్న ఆర్టీసీ బస్ ను లింగాల కాజ్వే వద్ద బస్సును తపించి ముందుకెళ్లేందుకు వేగంగా వెళుతూ.. ఎదురుగా వస్తున్న డీసీఎం ను బలంగా ఢీకొట్టడంతో బైక్ పై ప్రయాణిస్తున్న వ్యక్తి ప్రమాద స్థలంలోనే మృతి చెందాడు మృతుడు పెనుగంచిప్రోలు మండలానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply