తృటిలో తప్పిన ప్రాణాపాయం

తృటిలో తప్పిన ప్రాణాపాయం

ఎ. కొండూరు, ఆంధ్రప్రభ: గ్యాస్ లీక్ కారణంగా పూరిళ్లు పూర్తిగా దగ్ధమైన ఘటన ఎ. కొండూరు మండలంలో బుధవారం చోటుచేసుకుంది. మండలంలోని ఎ.కొండూరు తండా పంచాయతీ పరిధిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా ఆందోళన కలిగించింది. గ్రామానికి చెందిన భూక్యా గోపి, అతని భార్య భూక్యా మధు మధ్యాహ్న సమయంలో వంట చేసేందుకు గ్యాస్ పొయ్యిని వెలిగించారు. కొద్దిసేపటికే గ్యాస్ సిలిండర్ నుంచి మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. దీంతో మధు భయంతో ఇంటి బయటకు పరుగెత్తి కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకున్నారు.

అయితే అప్పటికే మంటలు వేగంగా వ్యాపించి ఇళ్లు అగ్నికి ఆహుతైంది. ఇంటిలో ఉన్న సుమారు రూ.5 లక్షల నగదు, 5 కాసుల బంగారు ఆభరణాలు మంటల్లో కాలి బూడిదైనట్లు బాధితుడు గోపి తెలిపారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.

Leave a Reply