మోగిన సమ్మె సైరన్.. నిలిచిన ఆర్టీసీ సర్వీసులు

మోగిన సమ్మె సైరన్.. నిలిచిన ఆర్టీసీ సర్వీసులు

కొత్తూరు, ఆంధ్రప్రభ : తమ డిమాండ్లను నెరవేర్చాలని ఆర్టీసీ ఉద్యోగులు చేపట్టిన సమ్మె సైరన్ మంగళవారం ఆర్థరాత్రి నుండే మొదలైంది. దీంతో బుధవారం తెల్లవారుజామునుండి ఆర్టీసీ బస్సులు బంద్ కావడంతో దూర ప్రాంతాలకు ప్రయాణం చేయాల్సిన ప్రయాణికులు రోడ్ల పై గంటల తరబడి వేచి చూసి ఇంటికి తిరుగు ప్రయాణమయ్యారు. దీంతో వ్యాపారస్తులు, ఉద్యోగులు, కార్మికులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. చేసేది ఏమీ లేక మరికొంత మంది ప్రయాణికులు ప్రైవేటు సర్వీసులను ఆశ్రయించారు. సమీప ప్రాంతాలకు వెళ్ళవలసిన ప్రయాణికులు ఆటోలు, జీపులలలో తమ ప్రయాణాన్ని కొనసాగించారు.

గతేడాది మే 6 న సమ్మెకు దిగుతున్నట్లు ఆర్టీసీ కార్మికులు ప్రకటించటంతో నాడు ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపి సమ్మెను అడ్డుకుంది. కాగా చర్చలు జరిపి ఏడాది కావస్తున్నా నేటికి ప్రభుత్వం తమ డిమాండ్లపై ఏ మాత్రం స్పందించకపోవడంతో ఆర్టీసీ ఉద్యోగులు ఈ నెల 22 నుండి సమ్మెకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం దిగివచ్చి ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను నెరవేరుస్తుందా లేదా వేచి చూడాల్సిందే. ఏది ఏమైనప్పటికీ ఆర్టీసీ సమ్మెతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులకు లోనవుతున్నారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి తగిన చర్యలను చేపట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు.

Leave a Reply