45 years | జీవన్ రెడ్డి పార్టీలో చేరడంపై కేసీఆర్

45 years | జీవన్ రెడ్డి పార్టీలో చేరడంపై కేసీఆర్
45 years | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. జగిత్యాలలో జరిగిన ‘ప్రజా ఆశీర్వాద సభ’ వేదికగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి పార్టీలో చేరడంపై స్పందిస్తూ, ఇది రాష్ట్ర భవిష్యత్తు కోసం తీసుకున్న సాహసోపేత నిర్ణయమని కొనియాడారు. జీవన్ రెడ్డి కేవలం ఒక పదవి కోసమో, అధికారం కోసమో కాకుండా.. అపారమైన గుండె ధైర్యంతో, రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా ఈ నిర్ణయం తీసుకున్నారని కేసీఆర్ పేర్కొన్నారు.
“జీవన్ రెడ్డితో నాకు ఇప్పటిది కాదు, దాదాపు 45 ఏళ్లుగా విడదీయలేని స్నేహం ఉంది” అని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. వారిద్దరి మధ్య ఉన్న రాజకీయ,
వ్యక్తిగత అనుబంధాన్ని సభా వేదికగా పంచుకున్నారు. తెలంగాణలో మళ్లీ బీఆర్ఎస్ ప్రభంజనం మొదలైందని, 100 శాతం తదుపరి ప్రభుత్వం తమదేనని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు మళ్లీ గులాబీ జెండాకే పట్టం కట్టబోతున్నారని జోస్యం చెప్పారు.
