ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోండి

పాయకాపురం, ఆంధ్రప్రభ : ప్రజలు ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కల్వరి ప్రేమ ప్రార్థన సహవాసము సంఘ కాపరి రెవ. ఎస్. కిరణ్ కుమార్ సూచించారు. సోమవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, షైన్ హాస్పిటల్స్‌కు చెందిన డాక్టర్ కాట్రగడ్డ వికాస్ ఆధ్వర్యంలో ఆర్థోపెడిక్, జనరల్ సర్జరీ, న్యూరో సర్జరీ, యూరాలజీ, గైనకాలజీ, ఈఎన్టీ తదితర విభాగాలకు సంబంధించిన రోగులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఈ నెల 21వ తేదీన స్థానిక 64వ డివిజన్ కండ్రికలోని టీడీపీ కార్యాలయం (అధ్యక్షుడు కె. రవికుమార్) పక్కన ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ వైద్య శిబిరం నిర్వహించబడుతుంది. ఈ శిబిరాన్ని సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు.

అనుభవజ్ఞులైన వైద్య బృందం ఆధ్వర్యంలో అత్యాధునిక సాంకేతికతతో చికిత్సలు అందించనున్నారని, 24 గంటల ఆర్థోపెడిక్ సేవలు కూడా అందుబాటులో ఉంటాయని తెలిపారు. తెల్ల రేషన్ కార్డు కలిగిన వారికి పసరతిత్తుల రాళ్లు, గర్భసంచి తొలగింపు, వెరికోస్ వెయిన్స్ వంటి శస్త్రచికిత్సలు ఉచితంగా నిర్వహించనున్నట్లు చెప్పారు.

అలాగే అన్ని రకాల ఇన్సూరెన్సులు, ఎన్టీఆర్ వైద్య సేవ, ఆరోగ్య భద్రత, ఈహెచ్‌ఎస్ పథకాలు అందుబాటులో ఉన్నాయని పాస్టర్ కె. రవికుమార్ తెలిపారు.

Leave a Reply