ఎఫ్ఎల్ఎన్ లక్ష్య సాధనలో జిల్లా ముందంజలో ఉండాలి.

ఎఫ్ఎల్ఎన్ లక్ష్య సాధనలో జిల్లా ముందంజలో ఉండాలి.

జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష.
గణిత నైపుణ్యాలపై ప్రత్యేక దృష్టి.
వినూత్న బోధనలతో మెరుగైన ఫలితాలు సాధించాలి.

పెద్దపల్లి రూరల్: ఎఫ్.ఎల్.ఎన్ లక్ష్యాలను సమర్థవంతంగా అమలు చేసి, ప్రాథమిక స్థాయిలో విద్యార్థుల భాషా, గణిత నైపుణ్యాలను పెంపొందించడంలో పెద్దపల్లి జిల్లా ముందంజలో నిలవాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. శుక్రవారం పెద్దపల్లిలో నిర్వహించిన ఎఫ్ఎల్ఎన్ జిల్లా స్థాయి సమావేశంలో కలెక్టర్ పాల్గొని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో ప్రొజెక్టర్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తమ ఫలితాలు సాధించిన పాఠశాలలను ఎఫ్ఎల్ఎన్ ఛాంపియన్ పాఠశాలలుగా ఎంపిక చేసి ప్రశంస పత్రాలు అందజేశారు. ఉపాధ్యాయులు విద్యార్థుల పఠన అవగాహన మెరుగుపరచడానికి అనుసరించిన బోధన పద్ధతులు, భాషలలో రచనా నైపుణ్యం, గణితంలో గుణకం, భాగహారం నైపుణ్యాల పెంపుకు చేపట్టిన తరగతిగది చర్యలపై తమ అనుభవాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ బేస్‌లైన్, మిడ్‌లైన్, ఎండ్‌లైన్ పరీక్షల ఫలితాలను విశ్లేషించి, విద్యార్థుల అభ్యాస స్థాయిని నిరంతరం మెరుగుపరచాలని సూచించారు.

మండలాల వారీగా ఫలితాలను సమీక్షిస్తూ లోపాలు ఉన్న చోట ప్రత్యేక చర్యలు తీసుకోవాలని తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరానికి ముందస్తుగా ప్రణాళికలు రూపొందించి ప్రతి విద్యార్థి ప్రాథమిక నైపుణ్యాలు, రీడింగ్ కాంప్రెన్షన్ సామర్థ్యాలను పెంపొందించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని ఆదేశించారు. గడ్డం జగదీశ్వర్, ఆర్. కిరణ్, కృష్ణ రెడ్డి, రవి, ప్రభాకర్ రెడ్డి, దేవేందర్ రెడ్డి, పుష్పలత తదితరులకు జిల్లా కలెక్టర్ ప్రత్యేక ప్రశంస పత్రాలు అందజేశారు. సూపర్ సమ్మర్ క్యాంప్ వీడియోను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి జి.శారద, జిల్లా అకడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ పిఎం షేక్, అలోక్ ప్రాజెక్ట్ సిఈఓ ప్రమోద్, ప్రతినిధి సమీద్ అహ్మద్, జిల్లాలోని ఎంఈఓలు, కాంప్లెక్స్ హెడ్‌మాస్టర్లు, జిల్లా రిసోర్స్ టీం సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply