పెడన మాజీ ఎంపీపీ సౌభాగ్యవతి మృతి

పెడన మాజీ ఎంపీపీ సౌభాగ్యవతి మృతి

పెడన – ఆంధ్రప్రభ : పెడన మండల పరిషత్ మాజీ అధ్యక్షురాలు నల్లమోతు సౌభాగ్యవతి గురువారం ఉదయం మృతి చెందారు. ఆమె వయస్సు 89 సంవత్సరాలు. దివంగత సీనియర్ రాజకీయ నాయకుడు ప్రకాశరావు భార్య ఈమె. ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. 1987వ సంవత్సరంలో ఈమె ఎంపీపీగా పని చేశారు. ప్రత్యక్ష ఎన్నికలో ఆమె గెలుపొందారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఆమె ఎంపీపీగా పని చేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈమె ఎంపీపీగా గెలుపొందారు. అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలు కూడా ఆమె ఎవరి ప్రలోభాలకు లొంగేవారు కాదు.

అప్పట్లో ఎంపీపీలకు పవర్స్ ఎక్కువగా ఉండేవి. తాను అనుకున్నది చేసే వారు కానీ సిఫారసులకు కూడా అంతగా ప్రాధాన్యత ఇచ్చేవారు కాదు. గత కొన్ని రోజులుగా ఆమె తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. విజయవాడలోని ప్రైవేట్ ఆసుపత్రిలో ఆమె చికిత్స పొందుతూ చనిపోయారు. టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు బురగడ్డ వేదవ్యాస్.. సౌభాగ్యవతి మృతి పట్ల సంతాపం తెలిపారు. విజయవాడలోని ఆసుపత్రికి వెళ్లి శ్రద్ధాంజలి ఘటించారు. అలాగే కమలాపురం డిసి చైర్మన్ నల్లమోతు చంద్రమోహన్ రావు కూడా సంతాపం తెలిపారు.

Leave a Reply