విద్యుత్ శాఖ ఆహ్వానం – పోలీస్ శాఖ అరెస్ట్..

విద్యుత్ శాఖ ఆహ్వానం – పోలీస్ శాఖ అరెస్ట్..

వేంసూరు, ఆంధ్రప్రభ : మండల పరిధిలోని వెంకటాపురం గ్రామంలో 33 కెవి సబ్ స్టేషన్ శంకుస్థాపన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ శంకుస్థాపన కార్యక్రమం కూడా సత్తుపల్లి మండలం రేజర్ల గ్రామంలో ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో శంకుస్థాపన కార్యక్రమాన్ని అడ్డుకుంటారనే కారణంగా బీఆర్ఎస్ నాయకులను ముందస్తు అరెస్టులో భాగంగా.. తెల్లవారు జామున వెంకటాపురంలోని వారి నివాసాలకు వెళ్లి మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పాలా వెంకటరెడ్డి, మాజీ ఎంపీపీ పగుట్ల వెంకటేశ్వరరావు, సర్పంచ్ సాధులక్ష్మి, ఉప సర్పంచ్ పాలా గంగాధరరెడ్డి లను స్థానిక పోలీస్ స్టేషన్ నకు తీసుకొచ్చినట్లు తెలిపారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే శంకుస్థాపన కార్యక్రమానికి సర్పంచ్ సాధులక్ష్మి, ఉప సర్పంచ్ పాలా గంగాధరరెడ్డి లను విద్యుత్ శాఖ అధికారులు ఆహ్వానించగా, అదే సమయంలో అరెస్టు చేయటం కొసమెరుపు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a Reply