పరకాలలో బీజేపీ ఆధ్వర్యంలో ఫూలేకు నివాళులు

పరకాల, ఆంధ్రప్రభ : భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు ఫూలేకు శనివారం ఘనంగా నివాళులు అర్పించారు. పరకాల పట్టణ అధ్యక్షుడు గాజుల నిరంజన్ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ పరిధిలోని రాజీపేట గ్రామంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డాక్టర్ కాళీ ప్రసాద్ రావు హాజరై ఫూలే విగ్రహానికి పూలు చల్లి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహాత్మా ఫూలే సమసమాజ స్థాపనకు మార్గదర్శకుడిగా నిలిచారని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ హన్మకొండ జిల్లా ప్రధాన కార్యదర్శులు ఆర్.పి. జయంతిలాల్, దేవునూరి మేఘనాథ్, పరకాల మున్సిపల్ కౌన్సిలర్లు బెజ్జంకి పూర్ణచారి, కుక్కల విజయకుమార్, ఆకుల లావణ్య శ్రీధర్, అలాగే నాయకులు దంచనాదుల సత్యనారాయణ, మారేడుగొండ భాస్కరాచారి, మెంతుల సురేష్, దుబాసి కృష్ణప్రసాద్, ముత్యాల దేవేందర్, ధర్ముల దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.
