పెళ్లి కానుకగా రూ.21వేలు అందజేత..

వికారాబాద్, ఆంధ్రప్రభ : ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం వికారాబాద్ పట్టణంలోని 30వ వార్డు పరిధిలో గరీబ్ నగర్ కాలనీలో నివసించే కావలి రమేష్–స్వరూప దంపతుల కుమార్తె రాఘవి వివాహానికి కౌన్సిలర్ విజయలక్ష్మి–నాగరాజు రూ.21,000 ఆర్థిక సహాయం అందజేశారు.

ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రంగరాజు మాట్లాడుతూ, మున్సిపల్ ఎన్నికల సమయంలో ప్రతి పేద కుటుంబానికి వివాహం సందర్భంగా రూ.21,000 సహాయం అందిస్తామని ఇచ్చిన హామీని అమలు చేస్తున్నామని తెలిపారు.

Leave a Reply