ఏప్రిల్ 20 నుంచి తెలంగాణ ఓపెన్ స్కూల్ పరీక్షలు..

నిజామాబాద్ స్పోర్ట్స్, ఆంధ్రప్రభ : తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ డైరెక్టర్, హైదరాబాద్ ఆదేశాల మేరకు ఎస్‌ఎస్‌సి, ఇంటర్మీడియట్ పరీక్షలు ఈ నెల 20-04-2026 నుంచి 27-04-2026 వరకు నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి పి. అశోక్ తెలిపారు.

అభ్యర్థులు తమ హాల్ టికెట్లను అధికారిక వెబ్‌సైట్ https://www.telanganaopenschool.org ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు.

పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులందరూ డౌన్‌లోడ్ చేసుకున్న హాల్ టికెట్‌తో పాటు ఆధార్ కార్డును తప్పనిసరిగా పరీక్షా కేంద్రానికి తీసుకురావాలని పేర్కొన్నారు. పరీక్ష జరుగుతున్న అన్ని రోజుల్లో ఈ పత్రాలను వెంట తీసుకువెళ్లాలని ఆదేశించారు.

చివరి నిమిషంలో ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అభ్యర్థులు తమకు కేటాయించిన పరీక్షా కేంద్రాన్ని పరీక్షకు కనీసం రెండు రోజుల ముందుగానే సందర్శించాలని సూచించారు. ఈ మేరకు జిల్లా విద్యాశాఖాధికారి పి. అశోక్ ఒక ప్రకటనలో తెలిపారు.

Leave a Reply