తిరుమల పవిత్రతను కాపాడండి..
తిరుమల పవిత్రతను కాపాడండి..
టీటీడీ చైర్మన్ ను పదవి వెంటనే తొలగించాలి…
వైసీపీ నేతల డిమాండ్…
నంద్యాల బ్యూరో , ఆంధ్రప్రభ : దేశంలోనే అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను కాపాడాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నంద్యాల జిల్లా వైసీపీ నేతలు పేర్కొంటున్నారు.శనివారం పట్టణంలో టీటీడీ చైర్మన్ వ్యవహారశైలిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ర్యాలీ నిరసన ధర్నా చేపట్టా.తిరుమల పవిత్రతకు భంగం కలిగిస్తూ, అశ్లీల అసభ్యకర వ్యవహారాలకు పాల్పడుతున్న చైర్మన్ ను వెంటనే పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేశారు.శ్రీవెంకటేశ్వర స్వామి దేవస్థానం ఆవరణలో వైసీపీ నేతలు నిరసన చేపట్టారు.
శ్రీవారి పవిత్రతను కాపాడాల్సిన పదవిలో ఉండి, బూతురోత కార్యక్రమాలకు పాల్పడటం సిగ్గుచేటని ఎమ్మెల్సీ ఇసాక్ బాష విమర్శించారు. పవిత్ర పదవికి కళంకం తెచ్చిన చైర్మన్ ను వెంటనే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తప్పు చేసిన చైర్మన్ ను వెనకేసుకొస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీరును నేతలు తీవ్రంగా ఖండించారు చంద్రబాబు వైఖరిపై ధ్వజంమెత్తారు. అకృత్యాలను ప్రశ్నిస్తున్న వారిపై కక్షపూరితంగా దాడులు చేస్తూ, కేసులు నమోదు చేయడం దుర్మార్గమైన చర్య అని ఆవేదన వ్యక్తం చేశారు.
వెంటనే ఆయనను తొలగించి తిరుమల పవిత్రతను కాపాడాలని వైసీపీ నేతల డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర మహిళా విభాగం సెక్రెటరీ శశికళ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి సోమశేఖర్ రెడ్డి వైసీపీ జిల్లా ఉపాధ్యక్షుడు దల్ మిల్ అమీర్,మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ మాబునిషా, రత్నబాబు చౌదరి, జిల్లా మేధావుల సంఘం అధ్యక్షుడు రసూల్ ఆజాద్, జిల్లా వైసిపి అధికార ప్రతినిధి అనిల్ అమృత రాజ్, జిల్లా కార్యదర్శులు దేవ నగర్ బాషా, శివనాగిరెడ్డి, అసెంబ్లీ ఎస్టీ సెల్ అధ్యక్షుడు రామచంద్రుడు, తదితరులు పాల్గొన్నారు.
