29న టిడిపి 44 ఏళ్ల వసంతాల కార్యక్రమాలు..

29న టిడిపి 44 ఏళ్ల వసంతాల కార్యక్రమాలు..

44 ఏళ్లలో 3 సార్లు మినహా 11సార్లు శాసనసభ ఎన్నికలలో టిడిపి విజయం

తుగ్గలి, ఆంధ్రప్రభ : తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడాలనే లక్ష్యంతో స్థాపించబడిన తెలుగుదేశం పార్టీ (టీడీపీ) నేటికి 44 సంవత్సరాల ప్రస్థానాన్ని ఆదివారము కు విజయవంతంగా పూర్తి చేసుకుంది. 1982లో నందమూరి తారకరామారావు (ఎన్టీఆర్) స్థాపించిన ఈ పార్టీ, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది.ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యానికి ముగింపు పలుకుతూ, స్వీయ గౌరవం అనే నినాదంతో ఎన్టీఆర్ ప్రజల ముందుకు వచ్చారు. తక్కువ సమయంలోనే ప్రజల మన్ననలు పొందిన టీడీపీ, 1983లో జరిగిన ఎన్నికల్లో అద్భుత విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. రూ.2 కిలో బియ్యం పథకం, మహిళల సాధికారత, గ్రామీణాభివృద్ధి వంటి పథకాలు ప్రజల జీవితాల్లో మార్పు తీసుకువచ్చాయి.

1995 లో నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం చేపట్టిన తర్వాత పార్టీకి నూతన దిశ లభించింది. ఐటీ రంగ అభివృద్ధి, హైదరాబాద్‌ను సైబర్ నగరంగా తీర్చిదిద్దడం, ఈ-గవర్నెన్స్ ప్రవేశపెట్టడం వంటి సంస్కరణలతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించారు. 44 సంవత్సరాల ఈ ప్రయాణంలో టీడీపీ అనేక విజయాలు, కొన్ని పరాజయాలను ఎదుర్కొంది. అయినప్పటికీ పార్టీ తన సిద్ధాంతాలను విడిచిపెట్టకుండా ముందుకు సాగుతోంది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో 1983 లో మొదటి జరిగిన ఎన్నికలలో అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి తుగ్గలి తమ్మారెడ్డి విజయం సాధించడం జరిగింది.1985 లో జరిగిన శాసనసభ ఎన్నికలలో టిడిపి అభ్యర్థి మహాబలేశ్వర్ గుప్త విజయం సాధించడం జరిగింది. 1986లో జరిగిన ఉప ఎన్నికలలో టిడిపి అభ్యర్థి సుబ్బరతమ్మ విజయం సాధించడం జరిగింది.

1994,1999,2004, సంవత్సరాల్లో జరిగిన ఎన్నికలలో టిడిపి తరఫున ఎస్వి సుబ్బారెడ్డి విజయం సాధించడం జరిగింది. 2009 ఎన్నికలలో టిడిపి అభ్యర్థిగా కె ఈ ప్రభాకర్ విజయం సాధించడం జరిగింది. 2014 సంవత్సరంలో కేఈ కృష్ణమూర్తి టిడిపి అభ్యర్థిగా విజయం సాధించడం జరిగింది. 2019లో వైఎస్ఆర్సిపి తరఫున శ్రీదేవమ్మ విజయం సాధించడం జరిగింది. 2024 ఎన్నికలలో టిడిపి తరఫున కేఈ శ్యాం కుమార్ విజయం సాధించడం జరిగింది. 44 సంవత్సరాల లో పత్తికొండ నియోజకవర్గం లో 11 సార్లు శాసనసభకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలలో 2 సార్లు కాంగ్రెస్ పార్టీ, ఒకసారి వైసిపి, 11 సార్లు టిడిపి విజయం సాధించారు. దీంతో పత్తికొండ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉంది. ఎమ్మెల్యే కే ఈ శ్యామ్ కుమార్ ఆదేశాల మేరకు మండలంలోని అన్ని గ్రామాలలో టిడిపి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించేందుకు పార్టీ మండల కన్వీనర్ తిరుపాల్ నాయుడు ఏర్పాట్లు చేయడంలో నిమగ్నమయ్యారు.

Leave a Reply