కమనీయం రాములోరి కల్యాణం.

కమనీయం రాములోరి కల్యాణం.

శ్రీరామనవమి వేడుకల్లో సతీసమేతంగా పాల్గొన్న ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు

ఆంధ్రప్రభ, విజయవాడ రూరల్ : శ్రీరామనవమి వేడుకల్లో మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు , సతీమణి శిరీష శుక్రవారం పాల్గొన్నారు. ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లిలోని రామాలయంలో, విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలోని రామాలయంలో శ్రీరామనవమి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీతారాముల కల్యాణ మహోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు, శిరీష లు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. దేవతా మూర్తులను దర్శించుకున్నారు. సీతారాముల కల్యాణ వేడుకలు తిలకించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు మాట్లాడుతూ సీతారాముల ఆశీస్సులతో అందరూ సుఖసంతోషాలతో, శాంతి సౌభాగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. భక్తులు, స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply