భాగ్యనగరంలో భారీ వర్షం

భాగ్యనగరంలో భారీ వర్షం

ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసింది. కేపీహెచ్‌బీ, జేఎన్టీయూ, నిజాంపేట్, మూసాపేట్, జగద్గిరిగుట్ట, షాపూర్‌నగర్, చింతల్‌లో కొద్దిపాటి వర్షానికే రోడ్లు జలమయమయ్యాయి. బాలానగర్, సుచిత్ర, గాజులరామారంలో తేలికపాటి వర్షం కురిసింది. అధికారులు అప్రమత్తమై లోతట్టు ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపు చర్యలు చేపట్టారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.

Leave a Reply