Temple | ఘనంగా శివ పార్వతుల కల్యాణం…

Temple | ఘనంగా శివ పార్వతుల కల్యాణం…
Temple | వెబ్‌డెస్క్, ఆంధ్రప్రభ : డిండి మండలం వవిల్కొల్ గ్రామ పంచాయితీ పరిధిలోని రుద్రాయి గూడెం గ్రామంలో శనివారం ఉదయం స్థానిక ఆంజనేయ స్వామి వారి దేవాలయం ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది. ఇట్టి ఉత్సవాల్లో భాగంగా సాయంత్రం శివ పార్వతుల కల్యాణం వేద పండితుల చేత అద్భుతంగా జరిగింది. రుద్రాయిగూడెం గ్రామంలో కొలువైన శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయంలో ధ్వజస్తంభ ప్రతిష్ఠ ఉత్సవాలు గత మూడు రోజులుగా అత్యంత వైభవంగా జరుగుతున్నాయి..
ఈ ఉత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం 10.45 నిమిషాలకు వేద పండితుల పర్యవేక్షణలో దేవాలయం ఉత్సవాలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలో శనివారం సాయంత్రం శివ పార్వతుల కల్యాణం వేద పండితుల చేత ఘనంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారి కల్యాణం వీక్షించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కల్యాణ మహోత్సవంలో భక్తులు కుటుంబ సమేతంగా అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Temple | ఆకట్టుకున్నకల్యాణ మండపం అలంకరణ…


శనివారం రాత్రి జరిగిన శివ పార్వతుల కల్యాణం లో గ్రామంలో స్థానికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కల్యాణ వేదిక అలంకరణ స్థానికులను ఆకర్షించింది. దేవాలయ ఉత్సవాలను అత్యంత అద్భుతంగా నిర్వహించిన ఆలయ కమిటీ వారిని స్థానికులు అభినందించారు. అలాగే అన్ని పర్వదినాలకు దేవాలయంలో ఉత్సవాలు అత్యంత సంప్రదాయ బద్ధం గా నిర్వహించాలి అని కమిటీ వారిని స్థానిక వాసులు, భక్తులు కొరినారు..
CLICK HERE TO READ MORE : Arunachalam | పంచభూత లింగాలలో అగ్ని లింగ క్షేత్రం
